ప్రభాస్ Salaar Movie కోసం హెయిర్ స్టైల్ ఖర్చు ఎంతో తెలుసా ?
Prabhas Salaar Movie :బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతున్నాయి. తాజాగా నటిస్తున్న సినిమాల్లో సలార్ మూవీ ఒకటి.ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.
కెజిఎఫ్ కి పనిచేసిన సాంకేతిక బృందమే దీనికి పనిచేస్తున్నారు. శృతిహాసన్ పాత్ర డిఫరెంట్ గా ఉండనై అంటున్నారు. ఇక ప్రభాస్ ఈ మూవీకోసం 50కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఛత్రపతి తరహాలో ఈ మూవీ ఉంటుందని టాక్.
ఇందులో ప్రభాస్ హెయిర్ స్టైల్ లో విభిన్నంగా ఉంటుంది. ఇందుకోసం నిర్మాతలు భారీగానే ఖర్చుస్తున్నారట. ఒకసారి హెయిర్ కట్ చేయడానికి నాలుగు లక్షల వరకూ చెల్లిస్తున్నారట. ఇండియాలోనే టాప్ హెయిర్ స్టైలిస్ట్ లలో ఒకరైన బాలీవుడ్ హెయిర్ స్టైలర్ హలీం హకీమ్ గతంలో సాహూకి పనిచేసాడు. ఇతడే సలార్ మూవీకి చేస్తున్నాడు.