MoviesTollywood news in telugu

బెట్టింగ్ బంగార్రాజు హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Betting bangarraju actress nidhi : సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో వస్తుంటారు వెళుతుంటారు. హీరో హీరోయిన్స్ గా ఛాన్స్ లు తగ్గితే క్యారెక్టర్ యాక్టర్ గా ప్రస్థానం సాగించేవాళ్ళు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొట్టేవాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి రెండు సినిమాలు చేసి, ఇండస్ట్రీలో ఛాన్స్ లు లేక దూరమైన వాళ్ళు కూడా ఎక్కువమందే ఉన్నారు. అందులో హీరోయిన్ నిధిని ముఖ్యంగా ప్రస్తావించాలి.

డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన రణం 2మూవీలో నటించి, అది కాస్తా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ అమ్మడు అల్లరి నరేష్ హీరోగా నటించిన బెట్టింగ్ బంగార్రాజు మూవీ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి, తొలిసినిమాతోనే మంచి హిట్ అందుకుంది. సత్తిబాబు డైరెక్ట్ చేసాడు.

ఈ మూవీ తర్వాత నిధికి వరుస ఛాన్స్ లు వచ్చాయి. అయితే రణం 2మూవీ ఈమె కెరీర్ కి బ్రేక్ వేసింది. దీంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్ళాడి సెటిలయింది. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈమె ప్రస్తుతం బిజినెస్ రంగంలో బిజీగా ఉంది. మరోపక్క అల్లరి నరేష్ స్టార్ హీరోగా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. తాజాగా హీరోగా ఓ సినిమా రాబోతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."