MoviesTollywood news in telugu

బాలీవుడ్ హీరో షాహిద్ ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Bollywood young hero shahid kapoor House :అది బాలీవుడ్ అయినా,టాలీవుడ్ అయినా,కోలీవుడ్ అయినా ఏదైనా సరే, హీరో హీరోయిన్స్ కి సంబంధించిన అంశాలు ఆసక్తిగా ఉంటాయి. పైగా సోషల్ మీడియా వచ్చాక మరిన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇంటికి సంబంధించిన అంశం వైరల్ అవుతోంది. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్స్ కొత్త ఇళ్ళు కొనే ప్రయత్నం చేస్తుంటే, కొనేసిన వాళ్ళ జాబితాలో షాహిద్ కపూర్ పేరుంది.

ముంబైలో సీ ఫేసింగ్ తో గల డుప్లెక్స్ హౌస్ ని షాహిద్ కొన్నాడని, ఇది 42, 43అంతస్తులో నిర్మించినట్లు టాక్. దీనికి ఏకంగా 56కోట్లు వెచ్చించారట. ఈ కొత్తిల్లు కొనడానికి వెళ్లిన సందర్బంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్స్ వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే నూతన గృహంలోకి అడుగుపెట్టబోతున్నట్లు టాక్. ఇంతకీ షాహిద్ 2006లో వివాహ్ మూవీతో హిట్ కొట్టి, ఫామ్ లోకి వచ్చాడు.

హైదర్, ఉడ్తా పంజాబ్, ఆర్ రాజ్ కుమార్ వంటి సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఇక యాంకర్ గా కూడా తన సత్తా చాటుతున్న షాహిద్ ఇండస్ట్రీకి రాకముందు కొరియోగ్రాఫర్ గా చేసాడు. మ్యూజిక్ వీడియోలు, టివి యాడ్స్ చేసిన షాహిద్ 2003లో ఇష్క్ విష్క్ మూవీతో బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలిసినిమాతోనే ఫిలిం ఫెర్ అవార్దులు సొంతం చేసుకున్నాడు. తర్వాత పెద్దగా హిట్ రాకున్నా, 2006నుంచి జోరందుకుని, రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."