karthika deepam today episodeMoviesTollywood news in telugu

కార్తీక దీపం సీరియల్ హీరో నిరుపమ్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Karthika Deepam Karthik :తెలుగు బుల్లితెరపై టాప్ మోస్ట్ సీరియల్ గా నడుస్తున్న కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రతో పాపులర్ గా మారిన నిరుపమ్ పరిటాల ఈ మధ్య చాలా సీరియల్స్ లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 1988ఆగస్టు 19న జన్మించిన ఇతడి వయస్సు ప్రస్తుతం 33ఏళ్ళు. సినిమా నటుడిగా,రచయితగా ఓ వెలుగు వెలిగిన ఓంకార్ ఈయన తండ్రే. ఈయన తల్లిపేరు పద్మ. నిరుపమ్ పరిటాలకు కార్తీక్,డాక్టర్ బాబు అని నిక్ నేమ్స్ తో పిలుస్తున్నారు. విజయవాడలోనే వీరమాచినేని పద్దయ్య సిద్ధార్ధ స్కూల్లో చదువుకున్నాడు.

నిరుపమ్ పరిటాల కు 2010మే లో పెద్దల ఆశీర్వాదంతో సీరియల్ నటి మంజులతో ఘనంగా పెళ్లి జరిగింది. వీళ్లకు అక్షర ఓంకార్ అనే అబ్బాయి ఉన్నాడు. నటుడు, రచయిత ఓంకార్ సినిమాలకు పనిచేసినప్పుడు చెన్నైలో ఉండడం వలన నిరుపమ్ కూడా అక్కడే పెరిగాడు. అనారోగ్యంతో ఓంకార్ చనిపోవడంతో తనను సినిమా హీరోగా చూడాలన్న తండ్రి కోరిక మేరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా ఛాన్స్ లు రాలేదు. అయితే ఓ సీరియల్ లో ఛాన్స్ దక్కింది. చంద్రముఖి సీరియల్ ద్వారా హీరోగా మారడంతో కనీసం ఇలాగైనా హీరో అయ్యాయనని తనకు తానే నచ్చజెప్పుకునేవాడు.

మూగమనసులు,కాంచనగంగ,కార్తీకదీపం,కలవారి కోడలు ఇలా పలు సీరియల్స్ తో బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం మాటీవీలో కార్తీక దీపం, జీటీవీలో వస్తున్న అత్తారింటికి దారేది అలాగే హిట్లర్ గారి పెళ్ళాం ఇలా చాలా సీరియల్స్ లో నిరుపమ్ పరిటాల తనదైన నటనతో ఇమేజ్ తెచ్చుకున్నాడు. బిజీగా మారిపోయిన నిరుపమ్ పరిటాల కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్నందుకు రోజుకి 22వేలు అందు కుంటున్నాడు.

నెగెటివ్ రోల్స్ చేయడం కూడా ఇష్టపడే యితడు కొన్ని సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేసాడు. అయితే సీరియల్స్ లో తనపేరు కార్తీక్ గా పెట్టుకోవడం అచ్చొ స్తుందంట. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. రమ్యకృష్ణ ఇష్టమైన హీరోయిన్. దహి ఆవడ అంటే ఇష్టం. వైజాగ్ ఇష్టమైన ప్లేస్. 5కోట్ల నెట్ వర్త్ ఉంటుంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ భువన అపార్ట్ మెంట్స్ లో 80లక్షల ఖరీదు చేసే ప్లాట్ లో ఉంటున్న ఇతడికి 11లక్షల విలువైన కారు ఉంది.