Healthhealth tips in telugu

తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా…ప్రమాదంలో పడినట్టే

wrap food in newspaper : తినే పదార్థాలను న్యూస్ పేపర్లో చుడుతున్నారా…అయితే మీరు ప్రమాదంలో పడినట్టే. ఎలా అంటే…ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పునుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు..వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్‌ పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా? అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.

ఎందుకంటే..అలా చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇళ్లలో ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటి నుంచి నూనె తీసేయడానికి చాలామంది ఇళ్లలో ఉండే పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తారని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా ఏయడం వల్ల ఆహారనాళిక ద్వారా నేరుగా గ్రాఫైట్ మన శరీరంలోకి చేరిపోయి, మన మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు.. ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్థాలు మలవిసర్జన ద్వారానే వెళ్లిపోతాయి.

కానీ గ్రాఫైట్ మాత్రం అలా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లదు. అది ఎక్కడికీ పోకుండా మన బాడీలోనే పేరుకుపోతుంది. దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్ల న్యూస్‌పేపర్లను కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ మంచి విషయం పది మందికీ చేరాలా షేర్ చేయండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."