అల్లరి నరేష్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో…?

Tollywood Heroine sherin shringar : స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ కామెడీ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్ ఇప్పుడు ఛాన్స్ లు రాకపోవడంతో రూటు మార్చాడు. అల్లరి నరేష్ ఒకప్పుడు కితకితలు వంటి మూవీస్ తో ఆడియన్స్ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. అయితే హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో ఇప్పటికే క్యారెక్టర్ యాక్టర్ ద్వారా మహర్షి వంటి సినిమాల్లో నటించి, తన ఉనికిని కాపాడుకుంటున్నాడు.

ఇక అల్లరి నరేష్ తో నటించిన హీరోయిన్స్ కూడా ఛాన్స్ లు రాక, బుల్లితెరకు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ ప్రముఖ హీరో దర్శన్ నటించిన ధ్రువ మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన శేరిన్ శృంగార్ టాలీవుడ్ లో జూనియర్స్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. 2002లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా చేసింది. తెలుగు,కన్నడ,మలయాళం భాషల్లో కొంతకాలం బాగానే ఛాన్స్ లు తెచ్చుకున్న ఈమె సడన్ గా సినిమాలకు దూరమైంది.

పలు తెలుగు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినప్పటికీ వదిలేసుకుంది. దానికి తోడు ఆమె నటించిన ఐదారు సినిమాలు ఘోరంగా దెబ్బతినడంతో ఇక ఛాన్స్ లు రాకుండా పోయాయి. దాంతో బుల్లితెరవైపు అడుగులు వేసిన శేరిన్ శృంగార్ పలు డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరించింది. తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో లో కంటెస్టెంట్ గా చేసింది. ఇక బుల్లితెరపై 5 ధారావాహిక సీరియల్స్ లో చేసింది.