MoviesTollywood news in telugu

జేమ్స్ బాండ్ గా కృష్ణను సెలెక్ట్ చేయడానికి కారణం అదే

Krishna Gudachari 116 Telugu Movie :టాలీవుడ్ జేమ్స్ బాండ్ ఎవరని ప్రశ్న ఉదయిస్తే సూపర్ స్టార్ కృష్ణ పేరు ఠక్కున చెబుతారు. అంతలా పాపులర్టీ వచ్చేసింది. డూండి నిర్మాతగా పానిక్ ఇన్ బ్యాంకాక్ అనే మూవీ స్పూర్తితో తీసిన గూఢచారి 116కి ఆరుద్ర రచన చేసారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఆరుద్ర రచన చేస్తే, మల్లికార్జున రావు తనదైన శైలిలో తెరకెక్కించారు. అచ్చం జేమ్స్ బాండ్ లా కృష్ణ సూటయ్యాడు.

ఆ సినిమా హిట్ కొట్టడంతో ఇక వరుస పెట్టి జేమ్స్ బాండ్ మూవీస్ కి కృష్ణ హీరో అయ్యాడు. అయితే జేమ్స్ బాండ్ సినిమాకు కృష్ణ పనికొస్తాడని ముందుగా గుర్తించి సెలక్ట్ చేసింది స్వయంగా నిర్మాత డూండీయే. కొత్త నటులతో ఆదుర్తి సుబ్బారావు తీసిన తేనెమనసులు సినిమాకు కృష్ణ తో పాటు రామ్మోహన్ కూడా ఎంపికయ్యాడు. ఆ సినిమాలో కారుని బైక్ తో ఛేజ్ చేసే దృశ్యంలో డూప్ లేకుండా కృష్ణ నటించి,కారులోకి జంప్ చేస్తాడు.

సరిగ్గా ఈ సీన్ డూండిని ఆకర్షించింది. దాంతో తాను తీయబోయే సినిమాకు కృష్ణను హీరోగా పెడుతున్నట్లు ఆదుర్తికి డూండి ఫోన్ చేయడం, అయితే రామ్మోహన్ ని అనుకుని అతడిని పంపడం,దాంతో మరోసారి ఫోన్ చేసి విషయం చెప్పడంతో కృష్ణను పంపడం జరిగిందట. అలా జేమ్స్ బాండ్ రోల్ కి కృష్ణ సైన్ చేసాడు. అలా మూడో సినిమాగా గూఢచారి 116చేసి హిట్ అందుకున్న కృష్ణ జేమ్స్ బాండ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."