MoviesSports

క్రికెటర్ శ్రీశాంత్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా…అసలు నమ్మలేరు

Cricketer srishanth wife Facts : సాధారణంగా భర్త విజయం వెనుక ఓ మహిళ హస్తం ఉంటుందని అంటుంటారు. ఇది అక్షరాలా క్రికెటర్ శ్రీశాంత్ విషయంలో నిజమైంది. ఆమె రేంజ్ కూడా ఎక్కువే. అవును ఆమె దివాన్ పూర్ రాజకుమారి. ఆమె పేరు భువనేశ్వరి. ఆమెతో శ్రీశాంత్ కి పెళ్లి ఫిక్స్ అయ్యాక అతడిపై క్రికెట్ లో బ్యాన్ విధించడం గందరగోళానికి దారితీసింది. అయితే కష్టకాలంలో సైతం శ్రీశాంత్ కి భువనేశ్వరి అన్నిరకాలుగా అండగా నిల్చింది.

నిజానికి 24ఏళ్ళ వయస్సులో శ్రీశాంత్ క్రికెట్ ఆడేందుకు రాజస్థాన్ వెళ్లగా అక్కడ పదవ తరగతి చదువుతున్న రాజకుమారి భువనేశ్వరి చూసింది. అప్పుడే ప్రేమలో పడిపోయింది. అయితే 20ఏళ్ళు వచ్చేవరకూ ప్రేమ విషయం బహిరంగ పరచలేదు. అయితే తరచూ ఫోన్ లో వీరిద్దరూ మాట్లాడుకునేవారు. ఇక హిందీ బిగ్ బాస్ షో వీకెండ్ లో అతడ్ని కలవడానికి భువనేశ్వరి వెళ్లడంతో ప్రేమ వ్యవహారం బయట పడింది. అందుకే అతడిపై బ్యాన్ ఉన్నప్పటికీ ఇద్దరికీ 2013లోనే పెళ్లి జరిగిపోయింది.

పైగా శ్రీశాంత్ పేరెంట్స్ కి భువనేశ్వరి పేరెంట్స్ ధైర్యం చెప్పారు. వీరికి కూతురు శాన్విక, కొడుకు సూర్యశ్రీ ఉన్నారు. తన ఆటతీరుతో దూసుకొచ్చి ఇండియా క్రికెట్ టీమ్ లో చోటు దక్కించుకున్న శ్రీశాంత్ అదే దూకుడుతో వివాదాస్పద క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నాడు. సహ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో ఘర్షణ, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నేరాలతో జీవితకాలం బ్యాన్ విధించారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో బ్యాన్ తగ్గింది. మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ లోకి దూసుకురాబోతున్నాడు.