MoviesTollywood news in telugu

బంపర్ ఆఫర్ కొట్టేసిన షణ్ముఖ్…ఇందులో నిజం ఎంత…?

Surya Web series shanmukh jaswanth : సూర్య వెబ్ సిరీస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న షణ్ముఖ్ జస్వంత్ యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఈనెల7వ తేదీన సూర్య వెబ్ సిరీస్ చివరి ఎపిసోడ్ కూడా వచ్చేసింది. చాలామంది అమ్మాయిల ఫాలోయింగ్ గల ఇతడిని షణ్ణు అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు ఇతడి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే, షణ్ణుకి సినిమా ఛాన్స్ వచ్చిందట. వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజైన విపరీతంగా ట్రెండింగ్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించే షణ్ణు క్రేజ్ వీరలెవెల్లో ఉంది. నిజానికి గతంలోనే సినిమా ఛాన్స్ రావడం, అయితే అవి చిన్నా చితకా పాత్రలు కావడంతో వదిలేసాడు. ఎలాగైనా మంచి పాత్రతో వెండితెరమీద ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళూరుతున్నాడు.

దాంతో వెతుక్కుంటూ ఇప్పుడు ఓ ఛాన్స్ వచ్చిందని టాక్. వెండితెర మీద కూడా తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. కాగా ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన యితడు ఓ యాక్సిడెంట్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. అయినా సరే, రీసెంట్ గా వచ్చిన సూర్య వెబ్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు