రకుల్ చీర రేటు తెలిస్తే షాకవ్వాల్సిందే…స్పెషల్ ఏమిటో మరి…?

Rakul preet singh saree :సెలబ్రిటీలు ఏం చేసినా వార్త అయిపోతుంది. అందునా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాళ్ళు కట్టుకునే బట్టలు, వేసుకునే వస్తువులు, కొనే బైక్ లు,కార్లు ఇలా అన్నీ బ్రాండెడ్ కావడంతో వాటి రేటు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే సెలబ్రిటీల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఓ వార్త వైరల్ అయింది.

పలు చిత్రాల్లో యంగ్ హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో రకుల్ బ్లాక్ బస్టర్ అందుకుంటుందని టాక్.

ఇక వైరల్ అవుతున్న రకుల్ వార్త విషయంలోకి వెళ్తే ఆమె కట్టుకున్న చీర ఏకంగా 9,900రూపాయలట. కంఫర్ట్ కి ప్రాధాన్యత ఇస్తానని, అందుకే రేటు గురించి ఆలోచించనని రకుల్ అంటోంది. బై అబిర్ అండ్ నాన్కీ బ్రాండ్ కి చెందిన చీరగా చెప్పింది. ఫ్యాషన్ గా ఉండే రకుల్ ఆభరణాల విషయంలో కూడా కంఫర్ట్ కే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది.