MoviesTollywood news in telugu

చరణ్ సినిమాల్లోకి రాకముందు శిక్షణ ఎలా తీసుకున్నాడో తెలిస్తే షాక్…!

Tollywood hero Ram Charan :మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు తెరమీదికి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ అనతికాలంలోనే తానేమిటో నిరూపించుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే రాణించడం కష్టమన్న విషయాన్ని వంటబట్టించుకున్న రామ్ చరణ్ డాన్స్ , ఫైట్స్ ,అభినయంలో తనకు తానే అనిపించుకుని,మెగా పవర్ స్టార్ అయ్యాడు. దీనివెనుక ఎంతో శ్రమ,కష్టం దాగున్నాయి.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరుత మూవీ ద్వారా వెండితెరపై మెరిసిన రామ్ చరణ్ విభిన్న అంశాలతో కూడిన సినిమాలు చేస్తూ అగ్రశ్రేణి హీరోల జాబితాలో కొనసాగుతున్నాడు. ఇక హీరోలలో డాన్సర్ లుగా చెప్పుకో తగ్గవాళ్ళలో రామ్ చరణ్ ని ప్రధానంగా చెప్పాలి. కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్పులను ఒక్కసారి చూస్తే చాలు మళ్ళీ చెప్పక్కర్లేదు. అంతలా అచ్చుగుద్దినట్లు స్టెప్స్ వేసుకుంటూ పోతాడు.

నిజానికి చెర్రీకి ఇంతటి పేరు తక్కువ సమయంలో రావడానికి శిక్షణ సమయంలో తీసుకున్న జాగ్రత్తలే కారణం అని చెప్పాలి. ముంబయిలో నట శిక్షణ పొందుతున్న సమయంలో మెగాస్టార్ కుమారుడిగా కాకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఉంటూ అన్ని విషయాలు నేర్చుకున్నాడు. నటనలో శిక్షణ పొందే సమయంలో కూడా ఇతర యాక్టింగ్ స్టూడెంట్స్ తో కల్సి కొన్ని స్కిట్స్ వేసేవాడు. అలా పొందిన శిక్షణ కారణంగానే తొలిసినిమా చిరుతలో అసమాన నటన ప్రదర్శించాడు. టాలెంటెడ్ హీరోలలో ఒకడిగా నిలబడ్డాడంటే అందుకు అతడు పొందిన శిక్షణ కారణం.