MoviesTollywood news in telugu

చంద్ర మోహన్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine Talluri Rameswari :తెలుగులో ఒకే మూవీలో హీరోయిన్ గా చేసి, తర్వాత టాలీవుడ్ కి దూరమై, బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన తాళ్లూరి రామేశ్వరి నిజం మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కళాతపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సీతామహాలక్ష్మీ మ్యూజికల్ హిట్ లో చంద్రమోహన్ సరసన హీరోయిన్ గా రామేశ్వరి అలరించింది. ఆ సినిమా అప్పట్లో విశేష ఆదరణ పొందింది. రెండు నంది అవార్డులు వచ్చాయి.

కానీ ఆ మూవీ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా సరే రామేశ్వరి తెలుగులో నటించలేదు. హిందీ మూవీస్ లో చేసింది. అలాగే ఒడియా భాషలో కూడా చేసింది. దాదాపు పాతిక చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన ఈమె బాలీవుడ్ లో దీపక్ సేథ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. బుల్లితెరలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమె అమెరికా అమ్మాయి అనే సీరియల్ లో తల్లి పాత్రలో నటించింది.

జి తెలుగులో ధారావాహికంగా ప్రసారమైంది. ఇక తేజ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం మూవీతో మహేష్ తల్లిగా నటించి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. అవినీతి మీద యుద్ధం ప్రకటించిన ఈ మూవీ ఎందుకో అప్పట్లో ఆకట్టుకోలేదు. దాంతో డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీలో తల్లి పాత్రకు ఫిలిం ఫేర్ అవార్డు ఆమెకు వచ్చింది. మంచి అవకాశాలు వస్తే నటించటానికి సిద్దంగా ఉంది.