MoviesTollywood news in telugu

వెంకీ నారప్ప సినిమా బడ్జెట్ ..బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

venkatesh narappa movie budget and business :మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ విభిన్న పాత్రలతో అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్టరీ వెంకటేష్. మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూ, ఈ తరంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. తాజాగా నారప్ప అనే మూవీలో నటిస్తున్నాడు. తమిళ మూవీ అసురన్ కి రీమేక్ గా వస్తున్న నారప్ప మూవీలో వెంకీ డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ సినిమాపై వెంకీ అంచనాలు పెంచేస్తువస్తున్నాడు. నిజానికి గత ఏడాది స్క్రీన్ మీదకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. గడిచిన సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకుని డేట్ కూడా రెడీ చేసుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ వచ్చి పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. అయితే నిర్మాత సురేష్ బాబు మాత్రం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని భావించి అమెజాన్ లో రిలీజ్ చేయడానికి ఒకే చేసారు.

థియేటర్ లోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా లేకపోవడంతో మరో నిర్మాత కళ్ళై పులి ఎస్ థాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓటిటి లో రిలీజ్ కి సురేష్ బాబు ఒకే చేసాడు. ఓటిటిలో రిలీజ్ కి దాదాపు 40కోట్లు దక్కిందని టాక్. మరో పది కోట్లు శాటిలైట్ హక్కుల ద్వారా రానున్నాయని అంచనా. కాగా రీమేక్ లో ఎలాంటి మార్పులు లేకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కేవలం 10కోట్లకే సినిమా ఫినిష్ చేసాడట. మొత్తానికి 40కోట్లు లాభం బానే దక్కిందని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."