మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో…?

Tollywood Hero varun Tej :మెగాస్టార్ తమ్ముడిగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసిన సినిమాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ మూవీ తీరని నష్టం కూడా తేవడంతో ఆగమ్య గోచరంలో పడ్డాడు. అయితే నాగబాబు జబర్దస్త్ షోలో జడ్జిగా ఎంటరయి నిలదొక్కుకున్నారు. ఇక మెగా ప్రిన్స్ గా ఫాన్స్ పిలుచుకునే వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ అందుకుంటూ, ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని అనే మూవీ చేస్తున్నాడు.

అలాగే ఎఫ్ 3లో వరుణ్ చేస్తున్నాడు. మరికొన్ని కమిట్ కాబోతున్నాడు. మొత్తం మీద వరుణ్ ఆర్ధికంగా బాగానే నిలదొక్కుకున్నారని టాక్. దీనికి తోడు మెగా డాటర్ నిహారిక మేరేజ్ భారీ ఎత్తున ఆర్భాటంగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిపించడంలో వరుణ్ తేజ్ చొరవ ఉందని టాక్. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. అయితే నటనాపరంగా మంచి మార్కులు కొట్టేసాడు. వాస్తవానికి హైదరాబాద్ యూసుఫ్ గూడా లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బికాం డిగ్రీ పూర్తిచేసాడు.

అయితే వరుణ్ తేజ్ ఇక సినిమాల మీద ఇష్టంతో స్టడీస్ కి స్వస్తి చెప్పాడు. ముకుంద తర్వాత మిస్టర్,కంచె,లోఫర్,ఫిదా,అంతరిక్షం,గద్దలకొండ గణేష్,ఎఫ్ 2 సినిమాలతో వరుణ్ కొన్ని హిట్స్ అందుకోగా, మరికొన్ని డిజాస్టర్ అయ్యాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆర్ధికంగా 9కోట్లు పెట్టి, మణికొండలో విల్లా కొన్నాడు. నాలుగు కార్లు,గాయత్రీ హిల్స్ లో ఓ గెస్ట్ హౌస్ కొన్నాడు. కాగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇతడికి చాలా ఇష్టమట.