karthika deepam today episodeMoviesTollywood news in telugu

కార్తీక దీపం సీరియల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డాక్టర్ బాబు

Karthika Deepam Serial Karthik :ఎప్పుడూ సీరియల్ చూడని వాళ్ళను సైతం టీవీలకు కట్టిపడేసిన ఘనత కార్తీక దీపం సీరియల్ కి దక్కుతుంది. ఎక్కడ ఉన్నా సరే,ఈ సీరియల్ వచ్చే సరికి టివి ముందు వాలిపోతున్నారు. అంతలా ఈ సీరియల్ జనంలోకి దూసుకుపోయింది. ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్స్ పూర్తయినప్పటికీ ఇంకా నడుస్తోంది. కాపుగంటి రాజేంద్ర డైరెక్షన్ లో వస్తున్న ఈ సీరియల్ బుల్లితెరపై టాప్ టీఆర్ఫీ రేటింగ్ సొంతం చేసుకుంది.

ఈ సీరియల్ లో నటీనటులు తమ అందంతో ,నటనతో ఆకట్టుకుంటున్నారు. హీరో గా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల,వంటలక్క పాత్రలో మలయాళీ నటి ప్రేమీ విశ్వనాధ్ అద్భుతంగా నటిస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. మలయాళంలో హిట్ అయిన కరతముత్తు సీరియల్ కి రీమేక్ గా నడుస్తున్న ఈ సీరియల్ లో కొన్ని మార్పులు,చేర్పులు చేసి,ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు జోడిస్తున్నారు. అయితే ఇంకా ఈ సీరియల్ కొనసాగడంపై విమర్శలు కూడా చేస్తున్నవాళ్లు ఉన్నారు.

కావాలనే సాగదీస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో డాక్టర్ బాబు పాత్రధారి నిరుపమ్ పరిటాల స్పందిస్తూ, ఏదో పిచ్చి పిచ్చిగా సాగదీయడం లేదని, సునిశిత సెంటిమెంట్ తో డైరెక్టర్ సరికొత్త ట్రీట్ మెంట్ ఇస్తున్నారని చెప్పుకొచ్చాడు. మరిన్ని ట్విస్టులు ఈ సీరియల్ లో ఉంటాయన్నారు. ఇక ఈ సీరియల్ కి డైరెక్టర్ గా కాపుగంటి రాజేంద్రను తప్ప మరొకరిని ఊహించుకోలేమని, అంతలా సీరియల్ కి క్రేజ్ తెచ్చారని కితాబిచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."