అల్లు అర్హ కంటే బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన వారసులు ఎంత మంది..?

Tollywood Child Artists :సినిమాల్లో బాల నటులుగా నటించడం తర్వాత హీరో హీరోయిన్స్ గా రాణించినవాళ్లు ఉన్నారు. అయితే పౌరాణిక పాత్రలతో బాల నటులు ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. అందులో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మనవరాలు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ చేరుతోంది. ఈ సినిమా కోసం బన్నీ ఫాన్స్ లో ఆసక్తి రేగుతోంది. ఒకప్పటి అందాల నటి టాలీవుడ్,బాలీవుడ్ లలో సత్తా చాటిన శ్రీదేవి కూడా బాలనటిగా చేసింది.

అయితే శ్రీదేవి కూడా పౌరాణిక పాత్రలతోనే ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో కాంధన్ కరునై మూవీలో అలాగే తెలుగులో యశోద కృష్ణ మూవీ లో చేసింది. ఇక భక్త ప్రహ్లాద మూవీతో రోజా రమణి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి,పలు చిత్రాల్లో బాలనటిగా నటించింది. పెద్దయ్యాక హీరోయిన్ గా ,క్యారెక్టర్ ఆర్టిస్టుగా,డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించింది.

ఇక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుడిగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్, ఆతర్వాత బాల రామాయణంలో రాముడిగా నటించాడు. అయితే ఆతర్వాత బాలనటుడిగా కన్పించకుండా, పెద్దయ్యాక హీరో అయ్యాడు. ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్ లో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న శాకుంతలం మూవీ తెరకెక్కుతోంది. 2022లో రిలీజ్ కానున్న ఈ మూవీలో బన్నీ కూతురు అర్హ కీలకమైన భరతుడి పాత్ర చేయబోతోంది.