సినిమాల్లోకి రాకముందు భానుచందర్ ఏం చేసేవాడో తెలుసా?
Tollywood hero bhanuchander :ఒకప్పటి సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన మాస్టర్ వేణు పలు సినిమాలకు మంచి సంగీతం అందించారు. రోజులు మారాయి,మాంగల్య బలం,సిరి సంపదలు,మేలుకొలుపు,ప్రేమించి చూడు,వింత కాపురం వంటి సినిమాలకు చక్కటి బాణీలు అందించారు. ఆయన కొడుకే భానుచందర్. సినిమాల్లో హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అందాల నటుడు సుమన్ కి మంచి దోస్త్. ఇద్దరూ కరాటేలో బ్లాక్ బెల్ట్స్ సాధించిన వాళ్ళే.
నిజానికి తనలాగే తన కొడుకు కూడా సంగీత దర్శకుడు కావాలని మాస్టర్ వేణు ఆశించారు. అందుకే గిటార్ నేర్చుకున్నాడు. ఎందుకంటే ఎన్నో రకాల వాయిద్యాలపై మాస్టర్ వేణుకి పట్టున్నప్పటికీ గిటార్ ప్లే రాదు. అందుకే గిటార్ ప్లే లో పట్టు సాధించిన భానుచందర్ వెస్ట్రన్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని భావించాడు. దాంతో ముంబయిలో ప్రసిద్ధ సంగీత డైరెక్టర్ నౌషాద్ దగ్గర భానుచందర్ ని అసిస్టెంట్ గా మాస్టర్ వేణు చేర్పించాడు.
సరిగ్గా అప్పుడే పాకీజా మూవీకి సంగీతం అందిస్తున్న నౌషాద్ సంగీతం అందిస్తుంటే, భానుచందర్ నోట్స్ రాస్తూ, గిటార్ ప్లే చేసేవాడు. తర్వాత ఆరునెలలకు మద్రాసు వెళ్లి తండ్రి మాస్టర్ వేణు దగ్గర చేరాడు. ఆతర్వాత బెంగుళూరు వెళ్లి పిబి శ్రీనివాస్ దగ్గర సంగీత కచేరీలు చేసాడు. అయితే తర్వాత అనుకోకుండా సినిమాల్లో హీరోగా మారిపోయాడు. సుమన్ మంచి ఫ్రెండ్ కావడం, ఇద్దరూ కరాటే నేర్చుకోవడంతో ఇద్దరూ కల్సి కొన్ని సినిమాల్లో హీరోలుగా చేసారు.