క్రికెటర్స్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ లు ఎవరో తెలుసా?

Heroines who are married cricketers :సినిమా హీరోలకు, హీరోయిన్స్ కి ఎంతటి క్రేజ్ ఉంటుందో, క్రికెటర్స్ కి కూడా అదే రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక చాలామంది తారలు క్రికెట్ అంటే ఇష్టపడడమే కాదు, క్రికెట్ లో ప్రావీణ్యం గల హీరోస్ ఉన్నారు. అలాగే కొందరు హీరోయిన్స్ అయితే క్రికెటర్స్ ని ప్రేమించి పెళ్లాడారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే, లాక్ డౌన్ సమయంలో ఓ జంట పెళ్లయింది. వారెవరో కాదు, సత్యాగ్రహ లో స్పెషల్ సాంగ్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నటాసా. తర్వాత ఓ పార్టీలో హర్ధిక్ పాండ్యా ను కల్సిన ఈ సెర్జియా బ్యూటీ ప్రేమలో పడడంతో లాక్ డౌన్ లో పెళ్లయింది.

స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో దిల్ దియా హై మూవీ ఫేమ్ గీతా బస్రా 2015లో డేటింగ్ స్టార్ట్ చేసింది. రెండేళ్లకు పెళ్లయింది. వీరికి ఓ పాప ఉంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన కిక్ మూవీలో ఐటెం సాంగ్ చేసిన హాజెల్ కీచ్ ను ఓ పార్టీలో చూసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2016లో వీరి పెళ్లి అయింది.

చక్ దే ఇండియా ఫేమ్ సాగరిక ఫ్రెండ్స్ తో మాములుగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ని కల్సి ప్రేమలో పడడంతో 2017లో పెళ్ళికి దారితీసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గతంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తో కల్సి యాడ్ షూట్ లో పాల్గొంది. అప్పుడు ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసి పెళ్లిపీటలు ఎక్కించింది. 2018లో పెళ్లయిన వీరికి వామిక అనే అమ్మాయి ఉంది.