స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood heroine vindhya : చిత్ర విచిత్రమైన సినిమా ఇండస్ట్రీ లో అదృష్టం లేకపోతె నిలదొక్కుకోవడం కష్టం.తెలుగు,తమిళం,మలయాళం తదితర భాషల్లో దాదాపు 20 చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడలేకపోయింది. ఆమె పేరు వింధ్య. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన సింహరాశి మూవీలో స్పెషల్ సాంగ్ తో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

నందమూరి హరికృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో వచ్చిన సీతయ్య మూవీలో కూడా నటించిన వింధ్య సినిమాలు కల్సి రాలేదు. కథల ఎంపిక కావచ్చు, మరొకటి కావచ్చు మొత్తం మీద ఇండస్ట్రీకి దూరమైంది. కొన్నాళ్ళు తమిళ రాజకీయాల్లో కూడా పనిచేసింది. అన్నా డీఎంకే లో చేరింది.

తమిళనాట అమ్మగా పేరొందిన దివంగత సీఎం జయలలిత మరణంతో రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్న వింధ్య రాజకీయాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా అన్నా డీఎంకే లో కార్యదర్శి పదవి లభించింది. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమై రాజకీయాల్లో కొనసాగుతోంది.