యాంకర్ విష్ణుప్రియ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

Tv Anchor Vishnu Priya : పలు సినిమాలు,వెబ్ సిరీస్ లో చేసిన విష్ణు ప్రియ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఈమె అసలు పేరు విష్ణుప్రియ భీమినేని. ప్రియ,విష్ణు అనే నిక్ నేమ్స్ తో పిలుస్తారు. 1987 ఫిబ్రవరి 22న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించిన ఈమెకు ప్రస్తుతం 34ఏళ్ళు. తండ్రి బిజినెస్,తల్లి గృహిణి. మాదాపూర్ శ్రీచైతన్య స్కూల్ లో చదివి, ఆతర్వాత హైదరాబాద్ ఎథిమ్స్ కాలేజీలో బిబిఎ పూర్తిచేసింది. తండ్రి ప్రకాశం జిల్లాకు చెందినప్పటికీ బిజినెస్ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. విష్ణుప్రియ తాతగారు ఆమెకు భగవద్గీత శ్లోకాలు నేర్పించేవారు.

దాంతో కాలేజీ అయిపోయాక సాయంత్రం వేళల్లో తన ఏరియాలో పిల్లలకు ప్రియ భగవద్గీత శ్లోకాలు నేర్పించేది. అలా నెలకు 3వేలు వరకు పాకెట్ మనీ సంపాదించేది. సినిమాల్లో నటించాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. దాంతో 2005లో మయూఖం అనే మలయాళీ మూవీతో కెరీర్ సార్ట్ చేసింది. 2006లో తమిళ మూవీ చేసిన ఈమె 2007లో తెలుగులో యమదొంగ, 2008లో కన్నడ మూవీ గోలి వంటి సినిమాల్లో నటించింది.

ఇక చాలా సీరియల్స్,వెబ్ సిరీస్ లో నటించిన ప్రియ 2017లో పోవేపోరా టివి షో ద్వారా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ తో కల్సి యాంకరింగ్ చేసి, అందరిని అలరించింది. ఇప్పుడు ఒక్కో షోకి 50నుంచి 70వేలు అందుకుంటున్న ప్రియకు ప్రభాస్, అల్లు అర్జున్ ఇష్టమైన హీరోలు.

హీరోయిన్స్ లో అనుష్క, సమంత అంటే ఇష్టం. ఇష్టమైన ప్రదేశం గోవా. వంట చేయడం, యోగా, బుక్స్ చదవడం హాబీస్. ఈమె నెట్ వర్త్ 5కోట్లు ఉంటుందట. ప్రస్తుతం మణికొండలో హాల్ మార్క్ అపార్ట్ మెంట్ లో కోటిన్నర విలువచేసే ఫ్లాట్ లో ఉంటోంది. ఈమె దగ్గర 2కార్లున్నాయి.