స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో గుర్తు పట్టారా…?

Bollywood heroine karishma kapoor :సెలబ్రిటీలు ఏంచేసినా, ఏ పోస్టు పెట్టినా తెగ వైరల్ అవ్వడం కామన్. అందునా తాము అభిమానించే హీరోయిన్స్ పోస్టులు చూసి కామెంట్స్ పెడుతూ షేర్స్ చేయడం కూడా చూస్తుంటాం. అదే కోవలో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరిష్మాకపూర్ చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. ఈమె పేరెంట్స్ కూడా బాలీవుడ్ లో స్టార్స్ గా రాణించారు.

అయితే కరిష్మా ఈమధ్య ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంటోంది. కానీ కరిష్మా చెల్లెలు కరీనా కపూర్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రాణిస్తూ, ఆదిపురుష్ మూవీలో సీతగా నటిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కరిష్మా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది.

దాంతో ఎప్పటికప్పుడు ఫోటోలు,వీడియోలు షేర్ చేస్తోంది. ఈమె ఇంస్టా గ్రామ్ ఖాతాకు 60లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. తాజాగా ఇల్లు ఆకారంలో గల హ్యాండ్ బాగ్ ధరించి,బొద్దుగా ఉన్న చిన్నప్పటి ఫోటో పోస్ట్ చేయడంతో సో క్యూట్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.