లక్ష్మీరాయ్ మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Tollywood heroine laxmi rai :హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చి, ఐటెం సాంగ్స్ తో అదరగొడుతున్న లక్ష్మీరాయ్ తెలుగులో కంటే ఇతర భాషా చిత్రాల్లో సత్తా చాటుతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయినప్పటికీ ఇతర భాషా చిత్రాల్లో మంచి గుర్తింపు అందుకుంది. శివరాజ్ కుమార్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మొదటి పారితోషికంగా పాతికవేలు అందుకుంది.

దైవభక్తి మెండుగా ఉన్న లక్ష్మీ రాయ్ బోల్డ్ నటనకు,గ్లామరస్ కి ఎంతో తేడా ఉందని చెబుతోంది.పాత్ర ఎలా ఉన్నా నటన బాగుండాలన్నదే తన ఉద్దేశ్యమని చెబుతోంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నెంబర్ 150బ్లాక్ బస్టర్ అయింది. అందులో లక్ష్మిరాయ్ స్పెషల్ సాంగ్ తో అలరించింది.

అలాగే రవితేజ నటించిన బలుపు మూవీలో కూడా లక్ష్మీరాయ్ స్పెషల్ సాంగ్ చేసింది. ఈమెకు బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇష్టమైన హీరోయిన్ అని చెబుతూ ఉంటుంది. ఇక ఈమె అక్కయ్యలు ఈమెను కృష్ణా అని పిలుస్తారట. వాళ్ళ అమ్మ మాత్రం లూసీ అని ముద్దుగా పిలుస్తుందట. మొత్తానికి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది.