MoviesTollywood news in telugu

విక్టరీ వెంకటేష్ గురించి మనకు తెలియని విషయాలు…ఎన్ని కోట్ల అస్థి…?

Tollywood Hero venkatesh assets value :మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా 1986లో కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ విభిన్న చిత్రాలతో విక్టరీ వెంకటేష్ అయ్యాడు. ఇటీవల నారప్ప రీమేక్ మూవీ ఓటిటి లో రిలీజ్ కాగా, త్వరలో ఎఫ్ 3మూవీతో రాబోతున్నాడు. ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సు దాటినా కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ, మల్టీస్టారర్ మూవీస్ తో కూడా దూసుకెళ్తున్నాడు.

ప్రకాశం జిల్లా కారంచేడులో నిర్మాత రామానాయుడు,రాజేశ్వరి దంపతులకు 1960డిసెంబర్ 13న జన్మించిన వెంకీ కి ప్రస్తుతం 61సంవత్సరాలు నిండుతాయి. వెంకటేష్ కి సురేష్ అనే అన్నయ్య, లక్ష్మి అనే సోదరి ఉన్నారు.ఎంజెఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, చెన్నై లయోలా కాలేజీలో చదివిన వెంకీ స్టడీస్ పూర్తిచేసాడు. కాలిఫోర్నియాలో ఎంబీఏ చేసాడు. 1985లో నీరజతో పెళ్లయింది. వీరికి నలుగురు సంతానం. ఆశ్రీత,భావన, హయవాహిని అనే ముగ్గురు అమ్మాయిలు, అర్జున్ దగ్గుబాటి అనే కుమారుడు ఉన్నారు.

ఇండియా వచ్చి సోదరుడు సురేష్ మాదిరిగా ప్రొడ్యూసర్ అవుదామనుకుంటే, సూపర్ స్టార్ కృష్ణ సూచన మేరకు వెంకటేష్ హీరోగా కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఖుష్భు హీరోయిన్. ఈ సినిమా మంచి హిట్ అయింది.స్వర్ణకమలం, పవిత్ర బంధం, అబ్బాయిగారు, సూర్యవంశం, చంటి వంటి విభిన్న బ్లాక్ బస్టర్ మూవీస్ వెంకీ చేయడంతో పాటు రెండుసార్లు నంది అవార్డు అందుకున్నాడు.

దృశ్యం, గోపాల గోపాల, బాబు బంగారం, గురు, ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్స్ కొట్టాడు.2500 కోట్ల నెట్ వర్త్ ఉంటుందని అంచనా. నటరత్న ఎన్టీఆర్ అభిమాన హీరో. సౌందర్య అభిమాన హీరోయిన్. బ్రౌన్ రైస్,దాల్ అంటే ఇష్టం. ఇటలీ టర్కీ ఇష్టమైన ప్రదేశాలు. హైదరాబాద్ మణికొండ లో ఖరీదైన ఇంట్లో నివాసం ఉంటున్న వెంకీ దగ్గర 4 అధునాతన సౌకర్యాలతో కూడిన కార్లు ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."