MoviesTollywood news in telugu

ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఏమి చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tamil Star comedian chinni jayanth son : సినిమాల్లో,రాజకీయాల్లో వారసత్వం జోరుగా సాగుతున్న రోజులివి. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్స్ కూడా తమ వారసులను సినిమా రంగంలోకి దింపేస్తున్నారు. ఒకవేళ సక్సెస్ కాకపొతే బుల్లితెరకు వెళ్లిపోతున్నారు. అయితే ఓ స్టార్ కమెడియన్ కొడుకు మాత్రం ఐ ఏ ఎస్ అయ్యాడు. తమిళంలో బాగా ఫేమస్‌ కమెడియన్ గా పేరొందిన చిన్ని జయంత్‌ నటించిన తమిళ మూవీస్ తెలుగులో డబ్బింగ్ కూడా అయ్యాయి. అందులో చిన్ని జయంత్ ని చాలామంది చూసే వుంటారు.

తమిళంలో శివాజీ గణేశన్‌ మొదలుకుని రజనీకాంత్‌,కమల్‌ హాసన్‌,విజయకాంత్‌,ప్రభు అలాగే కార్తీక్‌,అజిత్‌,విజయ్‌ ఇలా కోలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లోనూ నటించాడు. చిన్ని జయంత్‌ ప్రస్తుతం విజయ్‌ సేతుపతి ‘యాదుమ్‌ ఊరేఘెవరుమ్‌ కెలిర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఒకే ఒక సంఘటనతో అతడి పేరు ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

చిన్ని జయంత్‌ కొడుకు ఐ ఏ ఎస్ పూర్తిచేసి, ఏకంగా సబ్‌ కలెక్టర్‌ అవ్వడమే ఇందుకు కారణం. అతడి కుమారుడు శృతన్‌ జై నారాయణన్‌ 2020లో ఐఏఎస్‌ పూర్తి చేయడమే కాదు, ఆలిండియా లెవల్లో 75వ ర్యాంకు సంపాదించాడు. తాజాగా ట్యుటికోరన్‌ జిల్లాకు సబ్‌ కలెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. విద్య, జీవనోపాధి,మహిళా సాధికారత పెరుగుదల కు తనవంతు కృషి చేస్తానని శృతన్ అంటున్నాడు. కాగా తండ్రికి తగ్గ కొడుకు, తండ్రి గర్వపడేలా చేశాడు’ అంటూ శృతన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."