MoviesTollywood news in telugu

కార్తికేయ కెరీర్ ముగిసినట్టేనా…పరిస్థితి ఎలా ఉందంటే…

Tollywood Hero karthikeya :ఆర్ ఎక్స్ 100మూవీతో రొమాన్స్ చేసి, యూత్ లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న కార్తికేయ పరిస్థితి ఇప్పుడు రివర్స్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా వచ్చిన చావుకబురు చల్లగా డిజాస్టర్ అయింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో హిట్స్ వస్తేనే క్రేజ్. ఒకవేళ ప్లాప్ లు వచ్చాయంటే ఇక అంతేసంగతులు. వరుస ప్లాప్ ల ప్రభావం అతడి కెరీర్ పై పడిందని అంటున్నారు.

అసలే కరోనా ఎఫెక్ట్ తో చాలామంది సినిమాలు తీయడానికి ధైర్యం చూపడం లేదు. పెద్ద హీరోలతో చేసేవాళ్ళు తప్ప చిన్న హీరోలతో చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. పాయల్ రాజ్ పుత్ తో కల్సి ఆర్ ఎక్స్ 100తో హిట్ కొట్టిన కార్తికేయ ఆ తర్వాత హిప్పీ,గుణ 369,90ఎం ఎల్ మూవీస్ చేసినప్పటికీ నిరాశ పరిచాయి.

ప్రస్తుతం శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు చేస్తున్న రాజా విక్రమార్క మూవీలో కార్తికేయ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 1990లో చేసిన సినిమా పేరునే కార్తికేయ కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టారు. కన్నడ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్ర హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా కెరీర్ మలుపు తిప్పుతుందన్న ఆశతో ఉన్నారు. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ అదిరిందన్న టాక్ సొంతం చేసుకుంది.