పవిత్ర బంధం సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో…?
Pavitra Bandham Movie :విక్టరీ వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన పవిత్ర బంధం మూవీ ఎంతటి హిట్ అయిందో తెల్సిందే. సెంటిమెంట్ పుష్కలంగా గల ఈ సినిమాను మహిళా ఆడియన్స్ తో పాటు అందరూ బాగా ఆదరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీలకమైన పాత్ర అంటే వెంకీ తండ్రి గెటప్ లో అదరగొట్టారు. నిర్మాతలు వెంకట్రాజు, శివరాజు ఈ సినిమా నిర్మించారు.
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ వెనుక చాలా సిత్రాలు జరిగాయట. నిర్మాత సురేష్ బాబుని కల్సి సినిమా గురించి చెప్పగా ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ గా పెట్టాలని సూచిస్తూ ఒకే చెప్పేశారట. అయితే స్టోరీ నిర్మాతలకు నచ్చక పోవడంతో పరుచూరి బ్రదర్స్ తో మార్పులు చేయించారట ముత్యాల సుబ్బయ్య.
అయినా సరే, నిర్మాతలు ఒప్పుకోకపోవడమే కాక మరో స్టోరీ తో తీయాలన్న నిర్ణయానికి వచ్చారట. కానీ సురేష్ బాబు, వెంకటేష్ మాత్రం ఒకే చెప్పడంతో నిర్మాతలు అయిష్టంగానే స్టార్ట్ చేశారట. ఇక కీలకమైన హీరోయిన్ సెలక్ట్ లో రమ్యకృష్ణ ని నిర్మాతలు సూచించగా, సౌందర్యను ముత్యాల సుబ్బయ్య ప్రతిపాదించారట. మొత్తానికి డైరెక్టర్ మాట పైచేయి అయింది. ఇక ఈ సినిమాలో వెంకీ, సౌందర్య ల నటన సూపర్భ్ గా నిల్చింది.

