కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

costume designer neeraja :సినిమాల్లో తెరవెనుక పనిచేసే విభాగాల్లో కాస్ట్యూమ్స్ విభాగం ఒకటి. ఎలాంటి డ్రెస్సులు వేయాలి, ఎలా ఆకర్షణీయంగా డ్రెస్సుల్లో చూపించాలని కాస్ట్యూమ్ డిజైనర్స్ చూస్తుంటారు.కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కోన తెలుగు,తమిళ,కన్నడ సినిమాల్లో టాప్ డిజైనర్ గా రాణిస్తోంది.

ఎపి శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె అయిన నీరజ తాజాగా తన పెళ్ళికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో చాలామంది విషెష్ చెబుతున్నారు. ప్రముఖ రచయిత,నటుడు కోన వెంకట్ ఈమెకు సోదరుడు అవుతాడు.

అక్కినేని సమంతకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా నీరజ పనిచేస్తోంది.ఎన్నో హిట్ మూవీస్ కి ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తోంది. అందుకే ఈమె పెళ్ళికి సమంత స్పెషల్ గా హాజరైంది. మరిన్ని సినిమాలతో విజయాలను అందుకోవాలని పలువురు నెటిజన్స్ కోరుతున్నారు.