వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే…ఏమి అవుతుందో తెలుసా ?
Health benefits of fasting In Telugu :ఆషాడమాసం వెళ్లి శ్రావణమాసం వచ్చేసింది ఈ శ్రావణ మాసంలో చాలా మంది స్త్రీలు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసం చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. వారంలో ఒకసారి ఉపవాసం చేస్తే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండెకు సంబంధించిన సమస్యలు రావు.
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్ అజీర్తి మలబద్ధకం ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా వారంలో ఒకసారి ఉపవాసం చేస్తే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఉపవాసం చేసే సమయంలో ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉంటారు.
అలా తీసుకోవడం వలన మెదడు పనితీరు మెరుగు పడి ఆలోచించే తీరు జ్ఞాపక శక్తి పెరుగుతాయి అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది.రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

