ఎఫ్3 పై క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి…విషయం ఏమిటంటే…?

F3 Movie :విక్టరీ వెంకటేష్,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2 ఎలాంటి విజయాన్ని అందుకుందో వేరే చెప్పక్కర్లేదు. ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ పేరుతొ ఎఫ్ 2గా వచ్చిన ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. 2019సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు భారీ కలెక్షన్స్ రాబట్టింది.

దాంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3తీస్తున్నట్లు ఇప్పటివరకూ వార్తలు వచ్చాయి. ఎఫ్ 3 మూవీ కూడా షూటింగ్ నడుస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో కొంచెం ఆలస్యంగా జరుగుతున్న ఈ సినిమా గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన క్లారిటీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ మస్తుగా ఎఫ్ 3లో ఉంటుందని , ఇక సునీల్ కామెడీ మరింత ఆకట్టుకుంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. అయితే ఇది ఎఫ్ 2కి సీక్వెల్ మాత్రం కాదని తేల్చేసాడు. ఎఫ్ 2, ఏప్ 3 లకు కామన్ పాయింట్ ఒకటే అయినా మెయిన్ పాయింట్ లో తేడా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది.