లక్ష్మీ నరసింహ Vs వర్షం సినిమాలలో ఏది బిగ్ హిట్…?
Lakshmi Narasimha And Varsham Movies :నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లక్ష్మీనరసింహ, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం ఈ రెండు సినిమాలు 2004జనవరి 14న సంక్రాంతి కానుకగా ఒకేరోజు రిలీజై, సందడి చేశాయి. ఇద్దరు ఫాన్స్ భీభత్సంగా హడావిడి చేసారు. ఇందులో బిగ్గెస్ట్ అందుకున్న సినిమా వివరాల్లోకి వెళ్తే, సంక్రాంతికి బాలయ్యకు పేరు వచ్చినప్పటికీ లాంగ్ రన్ లో వర్షం మూవీ ప్రభాస్ కి పేరు తెచ్చిపెట్టింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన లక్ష్మీ నరసింహ మూవీకి జయంత్ సి పరాన్జీ డైరెక్టర్.
భారీ అంచనాలతో 450 సెంటర్స్ లో రిలీజైన లక్ష్మీ నరసింహ కు మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలివారం 10కోట్ల వరకూ షేర్ తెచ్చిన ఈ మూవీ 277సెంటర్స్ లో 50రోజులు, 86సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఇక ఇదేరోజు వచ్చిన వర్షం మూవీని ఎం ఎస్ రాజు నిర్మించారు. శోభన్ డైరెక్టర్.200సెంటర్స్ లో రిలీజై, 165సెంటర్స్ లో 50రోజులు, 68సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 18కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
అయితే లక్ష్మీ నరసింహ మూవీ 100డేస్ కి వచ్చేసరికి సెంటర్స్ తగ్గిపోవడం నిర్మాత బెల్లంకొండ తప్పిదం కన్పిస్తోంది. బాలయ్యతో విభేదాలు, ప్రమోషన్స్ పై శ్రద్ధపెట్టకపోవడం వంటి కారణాల వలన ఈ సినిమా లాంగ్ రన్ దెబ్బతింది. 16న్నర కోట్ల షేర్ తెచ్చింది. షేర్ విషయంలో పెద్దగా తేడా లేకున్నా లాంగ్ రన్ లో వర్షం కన్నా లక్ష్మీ నరసింహ వెనుకబడింది. లవ్ సెంటిమెంట్ తో వర్షం, పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో లక్ష్మీ నరసింహ తెరకెక్కాయి. వర్షం సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయగా, లక్ష్మీ నరసింహ పాటలు మణిశర్మ కంపోజ్ చేసాడు. ఈ రెండు మూవీస్ సాంగ్స్ బాగానే అలరించాయి.

