Devotional

ఈరోజే నాగపంచమి… ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు తెలుసా ?

Nag Panchami 2021 :అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి ప్రతి సంవత్సరం ఈ పండుగను శ్రావణ మాసంలో శుక్లపక్షం రోజున జరుపుకుంటారు. అలా ఈ సంవత్సరం నాగ పంచమి ఆగస్టు 13 అంటే ఈ రోజు వచ్చింది ఈరోజు భక్తులు చేసిన పాపాలు నుండి విముక్తి పొందడం కోసం నాగ దేవతకు పూజలు చేస్తారు.

ఇక ఈ రోజు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. నాగ పంచమి రోజు పూజలు చేసి ఉపవాసం ఉంటారు ఉపవాసం చేస్తే పాము కాటు నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం అలాగే ఈ నాగపంచమి రోజున పెద్ద ఎత్తున పుట్టలో పాలు పోస్తారు. ఈ విధంగా పుట్టలో పాలు పోయడం వల్ల పుట్ట లోపల ఉన్న పాములు ఇబ్బందులు పడతాయి

కాబట్టి పాలు పొట్టలోకి బదులుగా నాగ దేవతల విగ్రహాలకు పోవడం మంచిది అలాగే ఈ నాగపంచమి రోజున పరమ శివునికి అభిషేకం చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నాగ పంచమి రోజు వ్యవసాయం రైతులు చేయకూడదు అని చెబుతూ ఉంటారు ఎందుకంటే వ్యవసాయం చేయడం వలన భూమిలో ఉన్నటువంటి పాములు చనిపోతాయి అని అలా చెప్తారు. అలాగే చెట్లను నరకకూడదు.