MoviesTollywood news in telugu

ఈ హీరో గుర్తు ఉన్నాడా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Tollywood hero naveen chandra :సంభవామి యుగే యుగే మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర తెలుగు,తమిళ భాషల్లోనే కాదు, మిగిలిన భాషల్లోనూ చేస్తున్నాడు. క్యారెక్టర్ నచ్చితే అది నెగెటివ్ షేడ్ అయినా సరే ఒకే చెబుతున్నాడు. ఎలాగైనా ఇండస్ట్రీలో పట్టుసాధించాలని శ్రమిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా వెబ్ మూవీస్ లో సైతం చేస్తున్నాడు.

ఇప్పటికే భానుమతి రామకృష్ణ వెబ్ మూవీలో నటించిన నవీన్ చంద్ర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజయింది. ములుకుట్ల యస్వంత్ తెరకెక్కించిన ఈ మూవీ కి అచ్చు రాజమణి నేపధ్య సంగీతం అందించగా,శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సిటీలో అమ్మాయి,తెనాలి నుంచి సిటీకి వచ్చిన అబ్బాయికి మధ్య పుట్టిన లవ్ సెంటిమెంట్ నేపథ్యంలో భానుమతి రామకృష్ణ వెబ్ మూవీ రూపొందింది. అందాల రాక్షసి మూవీతో పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర సక్సెస్ బాట పట్టాలని ఆశిద్దాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."