MoviesTollywood news in telugu

అక్కినేని హీరోల పరిస్థితి ఏమిటి…ముందుకి వెళ్ళే ఛాన్స్ ఉందా…?

Akkineni family heros :ఒకప్పుడు సినిమా రంగానికి రెండు కళ్లుగా ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్ ఉండేవారు. నందమూరి,అక్కినేని పోటాపోటీగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వారి వారసులుగా నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున వచ్చి తమదైన శైలిలో ఆడియన్స్ ని మెప్పించి తమకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ మూడో తరానికి వచ్చేసరికి ఎన్టీఆర్ వంశంలో జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ వంటి వాళ్ళు కూడా హిట్స్ కొడుతున్నారు.

ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నా ఎప్పుడు వస్తాడో తెలీదు. అక్కినేని ఫ్యామిలీ విషయానికి వస్తే నాగార్జున ఇప్పటికీ కింగ్ నాగార్జున గా తనదైన నటనతో 60ప్లస్ లో కూడా దూసుకుపోతున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన నాగ్ కి 100కోట్ల మార్క్ సాధ్యపడలేదు. నాగ్ తో పోటీపడిన హీరోలు 100కోట్ల మార్క్ ని టచ్ చేసారు.

అయితే అక్కినేని మూడో తరంలోకి వస్తే, నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వంద కోట్ల మార్క్ ని టచ్ చేస్తారేమోనని అనుకుంటుంటే, కనీసం ఇండస్ట్రీలో నిలబడతారా అన్నట్లుగా ఉంది. ఎందుకంటే నాగచైతన్య కొన్ని హిట్స్ కొట్టినా, అఖిల్ కి అసలు హిట్ రాలేదు. అఖిల్ మూడు సినిమాలు చేస్తే మూడూ కూడా దెబ్బతిన్నాయి. అయినా ఫాన్స్ కి అఖిల్ మీద ఇంకా బోల్డెన్ని ఆశలున్నాయి. చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతో రికార్డు క్రియేట్ చేసిన అఖిల్ హీరోగా సక్సెస్ అవుతాడని ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."