MoviesTollywood news in telugu

ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ నటి కృష్ణప్రియ లైఫ్ స్టైల్…భర్త ఎవరో తెలుసా?

Intiki Deepam Illalu serial Fame Krishna Priya : బుల్లితెర ఆడియన్స్ ని సీరియల్స్ బాగా ఆకట్టుకోవడంతో వెండితెరకు ధీటుగా బుల్లితెర నటులకు పేరు వస్తోంది.ఇక ఇటీవల స్టార్ మా ఛానల్ లో స్టార్ట్ అయిన ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ చూరగొంటోంది.

నటీనటులు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే హీరోయిన్ గా చేస్తున్న కృష్ణప్రియ తన అభినయంతో,అందంతో మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపు సాధించింది. మౌనరాగం సీరియల్ హీరో అంకిత్ సరసన నటిస్తోంది. ఈమె అసలు పేరు దీపిక.

దీపిక 1991 జూన్ 27న బెంగళూరులో జన్మించి, అక్కడే స్టడీస్ పూర్తిచేసింది. తండ్రి మ్యుజిషియన్. తల్లి గృహిణి. ఆమె అత్త డాన్సర్ కావడంతో చిన్ననాటి నుంచి దీపిక డాన్స్ మీద మక్కువ పెంచుకుంది. అత్త దగ్గర ట్రైనింగ్ తీసుకుని,స్కూల్స్ ప్రోగ్రామ్స్ లో,స్టేజ్ షోస్ లో పాల్గొంది. బికాం గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఓ సాఫ్ట్ వేర్ లో ఉద్యోగం చేస్తూ, ఫ్రెండ్స్ సలహాతో సీరియల్ ఆడిషన్స్ కి వెళ్ళింది. కులవధు సీరియల్ కి సెలక్ట్ అయింది.

ఉదయ్ టివిలో ప్రసారమైన కులవధు సీరియల్ తో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి, తొలిసిరియల్ తోనే సక్సెస్ కొట్టింది. వెయ్యి ఎపిసోడ్స్ వరకూ ఈ సీరియల్ నడిచింది. తర్వాత స్టార్ సువర్ణ లో హారతి గుబ్బ, కీర్తి గుబ్బ సీరియల్స్ లో చేసింది.

2019లో స్రవంతి సీరియల్ లో లీడ్ రోల్ చేసింది. చిట్టి అనే మూవీ,షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించిన దీపిక 2019లో సౌత్ ఇండియన్ గ్లామర్ అవార్డు, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డు అందుకుంది. అదే ఏడాది కన్నడ సీరియల్ నటుడు ఆకాష్ ను పెళ్లిచేసుకుంది.