MoviesTollywood news in telugu

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క తెలుగు సీరియల్ ఏంటో తెలుసా..?

Jr Ntr Telugu Serial :బాల రామాయణంలో రాముడిగా నటించి చైల్డ్ ఆర్టిస్టుగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు. ఇక పెద్దయ్యాక స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, సింహాద్రి,ఆది వంటి మూవీతో స్టార్ డమ్ తెచ్చుకున్న తారక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కల్సి ఆర్ ఆర్ ఆర్ మూవీలో చేస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది.

టెంపర్,జనతా గారేజ్,నాన్నకు ప్రేమతో,అరవింద సమేత వీర రాఘవ వంటి మూవీస్ తో బ్లాక్ స్టార్ హిట్స్ కొట్టిన తారక్ తాజాగా బుల్లితెరమీద మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గతంలో బిగ్ బాస్ సీజన్ వన్ ప్రోగ్రాం చేసి అదరగొట్టాడు. ఇవన్నీ జనాలకు తెలుసున్నవే. అయితే తారక్ సీరియల్ లో నటించాడన్న విషయం చాలా తక్కువమందికి తెల్సిన విషయం.

2000 సంవత్సరంలో నిను చూడాలని మూవీతో హీరోగా ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తారక్ చిన్నప్పుడు గుణశేఖర్ తెరకెక్కించిన బాలరామాయణం తో పాటు ఒక సీరియల్ లో కూడా చేసాడట. ఈటివి మొదలు పెట్టిన కొత్తలో వచ్చిన భక్త మార్కండేయ సీరియల్ లో మార్కండేయుడుగా నటించాడు. అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఫాన్స్ ఖుషీ అవనున్నారు.