చేతులను 20 సెకన్ల పాటు రుద్ది శుభ్రంగా కడుక్కోవాలి… ఎందుకో తెలుసా ?
wash your hands about 20 seconds In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రత చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రమంలో చేతులను ఎక్కువగా శుభ్రం చేసుకుంటూ ఉంటున్నారు. దీంతో హ్యాండ్ వాష్, శాని టైజర్స్ వాడకం ఎక్కువగా అయిపోయింది. దేనితో చేతులను శుభ్రం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా 20 సెకన్ల పాటు రుద్ది కడగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ వచ్చిన వారి నుంచి వెలువడే తుంపర్లు అన్నిచోట్లా పడతాయి కాబట్టి ఉపరితలాలను మనం టచ్ చేసిన లేదా కోవిడ్ వచ్చిన వారికి దగ్గరలో ఉన్న మనకు కోవిడ్ వస్తుంది. ఈ తుంపర్లలో కొంత సమయం వైరస్ అలాగే నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ ఉపరితలాలను టచ్ చేస్తే వైరస్ వ్యాప్తి చెందుతుంది మనకు.
అందువల్ల ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటే వైరస్ వ్యాప్తి చెందదు. హ్యాండ్ వాష్, సబ్బు, హ్యాండ్ శానిటైజర్ ఇలా దేనితో చేతులను శుభ్రం చేసుకున్న సరే ఖచ్చితంగా 20 సెకన్ల పాటు రుద్ది కడుక్కోవాలి. హ్యాండ్ శాని టైజర్ వాడితే కనీసం దానిలో 60శాతం ఆల్కహాల్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కోవిడ్ బారి నుండి మనకు రక్షణ కలుగుతుంది.