Healthhealth tips in telugu

గుండె ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ టీలు… మీరు తాగుతున్నారా…?

Best teas for heart health :ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా గుండె సమస్యలు ఎక్కువైపోతున్నాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి సహాయపడే కొన్ని టీల గురించి తెలుసుకుందాం.

యాలకులతో తయారుచేసిన టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు ఒక కప్పు యాలకులతో తయారుచేసిన టీ తాగితే యాలకులలో ఉండే పొటాషియం రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండెకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే ఈ టీ తాగడం వలన బరువు కూడా తగ్గుతారు.

ప్రతిరోజు ఒక కప్పు బ్లాక్ టీ తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే ఆందోళన ఒత్తిడి తగ్గి బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

లెమన్ టీ తీసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. .ఈ టీ లో ఉండే పోషకాలు ధమనుల పనితీరును మెరుగుపరిచి గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.