పాలల్లో ఉడికించి తింటే రక్తహీనత,బలహీనత,కీళ్ల నొప్పులు జీర్ణ సమస్యలు జీవితంలో ఉండవు
Dry fruits milkshake benefits In Telugu :పాలలో నల్ల ఎండు ద్రాక్ష ఉడికించి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నల్ల ఎండు ద్రాక్షను మామూలుగా తినటం కన్నా పాలల్లో ఉడికించి తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో కరగనీ మరియు కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధ. పడుతున్నారు అలాంటి వారు పాలల్లో ఉడికించిన నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది దీనిలో ఫైబర్ పొటాషియం,ఫినాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.
యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన అలాగే ఫైటో కెమికల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన పంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కావిటిస్ కి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను అణిచివేస్తుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒక గ్లాసు పాలలో 5 నల్ల ఎండు ద్రాక్షను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన ఎండు ద్రాక్షను నములుతూ పాలను తాగాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తాగవచ్చు.

