దాన వీర శూర కర్ణ సినిమాలో 5 పాత్రల్లో నటించిన నటుడు ఎవరో…?

Daana Veera Soora Karna Movie : అప్పట్లో దాన వీర శూర కర్ణ సినిమా తెలుగు నాట సంచలనం. నాలుగు గంటలకు పైగా నిడివి గల ఈ సినిమా విశేష ఆదరణ చూరగొనడమే కాదు, ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూలు చేసి, కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరైన నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో 10 లక్షలు మాత్రమే బడ్జెట్ పెట్టారట.

కానీ పదింతలు లాభాలు తెచ్చిన దాన వీర శూర కర్ణ మూవీలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రలు వేసి మెప్పించారు. కృష్ణుడు,దుర్యోధనుడు,కర్ణుడు ఇలా మూడు డిఫరెంట్ పాత్రలతో మెప్పించడమే కాదు, ఆయన కుమారులు హరికృష్ణ అర్జునుడిగా,మరో కుమారుడు బాలకృష్ణ అభిమన్యుడుగా నటించారు.

ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించిన ఈ సినిమాలో చలపతిరావు ఏకంగా 5 పాత్రలు వేశారు. జరాసంధుడు,ఇంద్రుడు,అతిరధుడు ఈ మూడింటితో పాటు మరో రెండు అతిధి పాత్రల్లో కన్పించారట. ఇందులోని దుర్యోధనుడికి పెట్టిన పాట చిత్రం ఆయ్ భళారే విచిత్రం అప్పట్లో కేక పుట్టించింది. ఇక ఈ సినిమాతోనే కొండవీటి వేంకటకవి మాటల రచయితగా ఎంట్రీ ఇచ్చి, ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి వంటి డైలాగులతో అదరగొట్టారు.