MoviesTollywood news in telugu

దేశముదురు సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?

Desamuduru Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు మూవీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. 2007 జనవరి 12న రిలీజయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిల్చి, బన్నీకి మంచి పేరు తెచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మూవీని డివివి దానయ్య నిర్మించారు. ఇక ఈ మూవీకి పోటీగా వచ్చిన చిత్రాలేమిటో పరిశీలిస్తే, ప్రభాస్ నటించిన యోగి మూవీ జనవరి 14న రిలీజయింది. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్. అయితే ఈ మూవీ నిరాశ మిగిల్చింది.

దేశముదురు కి రెండు వారాల గ్యాప్ తో జనవరి 26న వచ్చిన పగలే వెన్నెల మూవీ లో శివ బాలాజీ హీరోగా నటించాడు. బ్రహ్మానందం,కోవై సరళ కామెడీ ఆకట్టుకుంటుంది. సివి రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్లాప్ అయింది.

ఇక జనవరి 26నే నవదీప్ హీరోగా పోరంబోకు మూవీ రిలీజయింది. శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజాస్టర్ అయింది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం మూవీ దేశముదురుకి రెండు వారాల ముందు డిసెంబర్ 26న విడుదలైంది. ఆసిన్ హీరోయిన్ గా నటించగా, పవన్ చెల్లెలుగా సంధ్య నటించింది. భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది.

సుధీర్ హీరోగా నటించిన యుగాంతం మూవీ డిసెంబర్ 30న రిలీజై ప్లాప్ గా నిల్చింది. దీనికి ఏ ఆర్ కన్నా డైరెక్టర్ గా వ్యవహరించారు. మొత్తం మీద బన్నీ దేశముదురు ముందు ఏ సినిమా ఆగలేకపోయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."