ఈ టాప్ హీరోల భార్యలు ఏమి చేస్తున్నారో తెలుసా?
Tollywood heroes wives : ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవారు. కాలక్రమేణా స్త్రీ పురుషులిద్దరూ సమానంగా సంపాదనలో పడుతూ వస్తున్నారు. అయితే కొన్ని రంగాల్లో పురుషుల కన్నా భార్యల సంపాదన ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లో హీరోల సంపాదన కన్నా వారి సతుల సంపాదన ఎక్కువగా ఉంటోందట.
మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ,ఎక్కువే సంపాదనలో ఉంది. అంతేకాదు,ఈమె పలు సామాజిక కార్యక్రమాలలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది.
అల్లు వారి అబ్బాయి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి కీప్ చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తూనే, తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇనిస్టిట్యూట్ బాధ్యత కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య, సమంత జంటకు గల క్రేజ్ వేరు. ఎందుకంటే ఇద్దరూ సినీ రంగంలో వాళ్ళే. అయితే నాగచైతన్య కంటే ప్రస్తుతం సమంతనే ఎక్కువ సంపాదీస్తోందట.సినిమాలు మాత్రమే కాకుండా సొంత క్లాత్ స్టోర్ రన్ చేస్తూ, పెయిడ్ ప్రమోషన్స్ భారీగా చేస్తూ లాక్ డౌన్ లో సైతం భారీగా సంపాదించింది.
ఒకప్పుడు సినిమాల్లో నటించి తర్వాత టివి రంగానికి వచ్చి టాప్ యాంకర్ గా రాణిస్తున్న సుమ బుల్లితెరపై దూసుకుపోవడమే కాదు, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తద్వారా తన భర్త రాజీవ్ కనకాల కన్నా ఎక్కువ సంపాదిస్తోంది.
ఇక నాచురల్ స్టార్ నాని… అంజనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా, వీరికి ఒక బాబు ఉన్నాడు. నాని సినిమాలతో బిజీగా ఉంటే తన భార్య అంజనా కూడా బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకొని రాజమౌళి ఆర్కా మీడియాలో జాయిన్ అయ్యి క్రియేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ గా ఉంటూ,నాని కన్నా ఎక్కువ సంపాదీస్తోంది.
హీరో అల్లరి నరేష్ భార్య విరూప ఈవెంట్ మేనేజర్ గా లక్షల్లో సంపాదిస్తూ, నరేష్ కన్నా పైచేయిగా ఉందట. నటుడు రాహుల్ రవీంద్ర భార్య చిన్మయి సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూ భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తోంది.