MoviesTollywood news in telugu

సుడిగాలి సుధీర్ ని ఇంటిలో ఏమని పిలుస్తారో తెలుసా?

jabardasth comedian sudigali sudheer : జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికీ టీఆర్ఫీ రేటింగ్ లో నెంబర్ వన్ గా నడుస్తోంది. ఈ షోతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది ఆర్ధికంగా నిలదొక్కుకోవడమే కాక, పలు షోస్,సినిమాల్లో ఛాన్స్ లు సంపాదిస్తున్నారు. అందులో ప్రధానంగా ఒకప్పుడు తినడానికి తిండికి కూడా ఇబ్బంది పడ్డ కమెడియన్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో కాస్తంత కూడబెట్టాడు. పలు షోస్ చేస్తూ బుల్లితెరమీద దూసుకెళ్తున్నాడు.

మరోపక్క సినిమాల్లో కూడా సుడిగాలి సుధీర్ నటిస్తూ తనకంటూ ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే సుడిగాలి సుధీర్ సోదరి ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వచ్చేసిన సందర్బంగా సుధీర్ గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది. తమ్ముడిని చిన్నప్పటి నుంచి సిద్ధూ అని పిలుస్తున్నామని చెప్పింది. ఇక ఈటీవీలో ఏ షో కైనా, ఈవెంట్ కైనా సుడిగాలి సుధీర్ ఉంటాడని వేరే చెప్పక్కర్లేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."