MoviesTollywood news in telugu

ముత్యమంత ముద్దు సీరియల్ హీరోయిన్ గీత రియల్ లైఫ్

Muthyamantha muddu serial heroine geetha :పలు చానల్స్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కి ఆదరణ బాగానే ఉండడంతో కొత్త కొత్త సీరియల్స్ ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా జి తెలుగులో ప్రసారమవు తున్న ముత్యమంత ముద్దు సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఉప్పెన మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి లాంచ్ చేసిన ఈ సీరియల్ కి వస్తున్న ఆదరణ టాప్ రేంజ్ లోనే ఉంది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న హీరోయిన్ గీత తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంటోంది.

మొదటి సీరియల్ తోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత అసలు పేరు నిషా మిలనా. 9 జూన్ 2000లో కర్ణాటక రాష్ట్రము సకలేశ్వర పురాలో జన్మించిన ఈమె ప్రస్తుతం బికాం చదువుతోంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డాన్స్ అంటే మక్కువ కావడంతో భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. స్కూల్ డేస్ నుంచి యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె ఇష్టకావ్య అనే కన్నడ సినిమాలోని ఒక సాంగ్ లో తన భరతనాట్యం స్టెప్పులతో అలరించింది.

సర్వ మంగళ మాంగల్యే అనే కన్నడ సీరియల్ తో బుల్లితెరపై గీత ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం గడ్డిమీర అనే కన్నడ సీరియల్ లో హీరోయిన్ గా చేస్తోంది. ఇది బాగా పాపులర్ కావడంతో ఫాన్ ఫాలోయింగ్ తో పాటు మంచి పేరు తెచ్చుకుంది. ఫలితంగా తెలుగులో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ముత్యమంత ముద్దు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."