వైదేహి పరిణయం సీరియల్ యుక్త రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Vaidehi Parinayam Serial Yukta Malnad : జి తెలుగులో ప్రసారమవుతున్న వైదేహి పరిణయం సీరియల్ తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఆడియన్స్ ఆదరణ పొందింది. ఇందులో నటీనటులు తమ నటనతో ,అందంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇందులో హీరోయిన్ గా చేసిన వైదేహి ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. ఈమె అసలు పేరు యుక్త మల్నాడ్. యుక్త,ప్రిన్సీ అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. కర్ణాటకలోని చిక్ మంగుళూరులో జులై 1996లో జన్మించిన ఈమెకు ప్రస్తుతం 26ఏళ్ళు.

సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ గర్ల్స్ హైస్కూల్ లో చదివిన యుక్త బెంగళూరు యూనివర్సి టీలో బికాం కంప్యూటర్స్ పూర్తిచేసింది. చిన్న నాటి నుంచి డాన్స్,యాక్టింగ్ అంటే ఇష్టం కావడంతో చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న డాన్స్ నేర్పించాడు. స్కూల్ డేస్,ఇంటర్ లలో ఎన్నో ప్రోగ్రామ్స్ లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. డిగ్రీ పూర్తయ్యాక హెయిర్ హోస్టెస్ కోర్సు పూర్తిచేసి జాబ్ తెచ్చుకుంది. కొన్నాళ్ళు ఉద్యోగం చేసాక,యాక్టింగ్ పై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్,కవర్ సాంగ్స్ లో నటించింది. మలయాళం,తమిళ సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా కూడా చేసింది.

ఇక 2015లో మిస్ మల్నాడ్ లో టైటిల్ విన్నర్ గా నిల్చింది. అప్పటి నుంచి యుక్త మల్నాడ్ గా పేరు మార్చుకుంది. కన్నడ మూవీస్, సీరియల్స్ లో చేసిన ఈమె తెలుగులో వైదేహి ప్రరిణయంతో ఎంట్రీ ఇచ్చి, తొలిసిరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో ఖరీదైన ఇంట్లో నివసిస్తోంది. ఒక కారుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమట. హీరోల్లో ప్రభాస్, అజిత్, హీరోయిన్స్ లో సమంత అంటే ఇష్టం. డాన్సింగ్, పోయేట్స్ రైటింగ్ హాబీస్. ఇంకా పెళ్ళికాలేదు. ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ కావాలన్నదే లక్ష్యమట.