కలెక్షన్ కింగ్ ని నిలబెట్టిన ‘అల్లుడుగారు’ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Mohan Babu alludu garu movie : సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ, సడన్ గా కేటుగాడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు తనదైన నటనతో అలరించాడు. తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినా, మళ్ళీ విలన్ గా తన సత్తా చాటుతూ వచ్చాడు. ఎలాగైనా హీరోగానే కొనసాగాలనుకున్న సమయంలో కొన్ని సినిమాలు ఇబ్బంది పెట్టాయి.

ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లుడు గారు మూవీ మోహన్ బాబు ని నిలబెట్టింది. శోభన,రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. జగ్గయ్య,చంద్రమోహన్,సత్యనారాయణ,గొల్లపూడి తదితరులు తమ నటనతో అలరించారు.

అన్నింటికీ మించి కెవి మహదేవన్ సంగీతం, జేసుదాస్ పాడిన సాంగ్స్ ఈ మూవీకి హైలెట్. మోహన్ బాబుకి ఎనలేని క్రేజ్ తెచ్చిన ఈ మూవీ ఆర్ధికంగా కూడా నిలబెట్టింది. ఇక అక్కడ నుంచి వరుస విజయాలు నమోదయ్యాయి. అందుకే దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనకు గురువుతో సమానమని మోహన్ బాబు చెబుతాడు. ఇద్దరూ ఇతన్ని హీరోగా నిలబెట్టినవాళ్ళే.