MoviesTollywood news in telugu

సినిమా బడ్జెట్ అంతా వాటికే సరిపోయిందట…షాకింగ్ కామెంట్స్ చేసిన గుమ్మడి

Tollywood Actor Gummadi :సినిమాల్లో ఇప్పుడంటే గ్రాఫిక్స్, సౌకర్యాలు వచ్చాయి గానీ, ఒకప్పుడు చాలా నేచురల్ గా తీయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. దాంతో ఖర్చు కూడా తడిసి మోపెడయ్యేది. పైగా అప్పట్లో సాంఘిక సినిమాల కన్నా జానపద, పౌరాణిక సినిమాలు ఎక్కువ. దాంతో మాంత్రికులు,మునులు, ఋషులు వారి శిష్యగణం ఇలా ఎన్నో పాత్రలు కూడా ఉండేవి.

అప్పట్లో మునులు పాత్రలను చిత్తూరు వి నాగయ్యతో పాటు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ఎక్కువగా వేసేవారు. అలాగే రమణారెడ్డి,రేలంగి వంటి వాళ్ళు కూడా గెడ్డలు, మీసాలు ఉన్న పాత్రల్లో వేసేవారు. ఒక సినిమాకు అయితే గెడ్డాలు, మీసాలు అతికించడానికే బడ్జెట్ మొత్తం అయిపోయిందట. ఒక సందర్భంలో గుమ్మడి ఈ విషయాలను పంచుకున్నారు.

గెడ్డాలు, మీసాలు ఊడిపోకుండా ఉండాలంటే ఖరీదైన మాక్స్ ఫాస్టర్ కంపెనీకి చెందిన గమ్ ని ఎక్కువగా వాడాల్సి వచ్చేదని చెప్పారు. ఇంతలా ఈ గమ్ వాడుతున్నందుకు సదరు కంపెనీ తమకు సన్మానం చేయాలని గుమ్మడి అనడమే కాకుండా ఆ కంపెనీకి లెటర్ కూడా రాశారట. కాగా ఈ గమ్ వలన స్కిన్ ఎలర్జీ వస్తుందని జగ్గయ్య ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండేవారట. తర్వాత కాలంలో వేరే రకం గమ్స్ రావడంతో జగ్గయ్య ఇలాంటి పాత్రలకు ఒకే చెప్పారట.