MoviesTollywood news in telugu

టివి నటి సమీరా షరీఫ్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల ఆస్తి…?

Tv actress Sameera sherief Luxury Lifestyle : తెలుగు,తమిళ సీరియల్స్ లో నటించి ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న సమీరా షరీఫ్ ని సామ్,సమీ అని పిలుస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ లో 1988నవంబర్ 14న జన్మించిన ఈమెకు ప్రస్తుతం 33ఏళ్ళు నిండుతాయి. తండ్రి హమీర్ షరీఫ్ వ్యాపారవేత్త. తల్లి గృహిణి. సీమా ఎఫ్ షరీఫ్ అనే సిస్టర్ ఉంది.సమీరా శ్రీ వివేకానంద స్కూల్ లో,విల్లా మేరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో స్టడీస్ పూర్తిచేసింది.

ప్రముఖ యాక్టర్ సన కొడుకు సయ్యద్ అన్వర్ ని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇటీవల వీరికి అబ్బాయి పుట్టాడు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడం వలన తండ్రి ప్రోత్సాహంతో డాన్స్ నేర్చుకుంది. స్కూల్, కాలేజీ కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేది. సీరియల్ ఆడిషన్స్ కి వెళ్లి, ఆడపిల్ల సీరియల్ తో 2006లో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో మంచి పేరు రావడంతో అభిషేకం, భార్యామణి, ముద్దుబిడ్డ, డాక్టర్ చక్రవర్తి, మూడుముళ్ల బంధం వంటి సీరియల్స్ లో చేసింది.

అదిరింది షో లో చేసినా కొన్ని కారణాల వలన తప్పుకున్న సమీరా తమిళ్ సీరియల్స్ లో కూడా చేసింది. బాబు పుట్టడం వలన సీరియల్స్ కి బ్రేక్ తీసుకుంది. మహేష్ బాబు, ప్రభాస్ ఇష్టమైన హీరోలు. సమంత,కాజల్ అంటే ఇష్టం. 16కోట్లు నెట్ వర్త్ . ఇక ఆమె పేరిట ఉన్న యూట్యూబ్ ఛానల్ కి మూడున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈమెకు రెండు కార్లున్నాయి. దాదాపు రెండు కోట్ల విలువైన అపార్ట్ మెంట్ హైదరాబాద్ లో ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."