యమదొంగ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?
Ntr Yamadonga Movie :అప్పటివరకూ లావుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ని స్లిమ్ గా తయారుచేయించి ఎస్ ఎస్ రాజామౌళి తెరకెక్కించిన యమదొంగ మూవీ అప్పట్లో సూపర్ హిట్. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్,సింహాద్రి సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక మూడో సినిమాగా యమదొంగ ప్రకటించాక మంచి క్రేజ్ వచ్చింది.
2007 ఆగస్టు 15న వచ్చిన ఈ మూవీలో కీరవాణి సాంగ్స్ ఆకట్టుకున్నాయి. యముడిగా మోహన్ బాబు, హీరోయిన్స్ గా ప్రియమణి, మమతా మోహన్ దాస్ నటించారు. 22కోట్ల షేర్ కలెక్ట్ చేసి, షిఫ్ట్ లతో కల్పి 405సెంటర్స్ లో 50రోజులు, 210సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది.
ఇక ఈ మూవీ రిలీజైన 8రోజులకే ఆగస్టు 23న యమగోల మళ్ళీ మొదలైంది వచ్చింది. శ్రీకాంత్,వేణు నటించిన ఈ మూవీ కి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్. మీరా జాస్మిన్,రీమాసేన్ హీరోయిన్స్. కృష్ణ భగవాన్ నారదుడిగా కామెడీతో అదరగొట్టాడు. సూపర్ హిట్ గా నిల్చి,మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీనికి 7రోజుల ముందుగా కళ్యాణం మూవీ వచ్చింది. చందు, జోస్న హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈమూవీ ప్లాప్ గా మిగిలింది. మురళీకృష్ణ డైరెక్టర్. యమదొంగకు 4రోజుల ముందుగా ఆగస్టు 11న సునీల్ హీరోగా అందాల రాముడు రిలీజయింది.
ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీ ఫుల్ కామెడీ, ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఎస్ ఏ రాజకుమార్ సాంగ్స్ అలరించాయి. లక్ష్మీనారాయణ డైరెక్ట్ చేసారు. సినిమా విజయాన్ని నమోదుచేసింది. వేణు,అల్లరి నరేష్ నటించిన అల్లరే అల్లరి మూవీ కి ముప్పలనేని శివ డైరెక్టర్. ఈ మూవీ ఏవరేజ్ గా ఆడింది. వడివేలు రెండు పాత్రలు చేసిన హింసించే 23వ రాజు పులకేశి గా చేసిన డబ్బింగ్ మూవీ యమదొంగకు పోటీగా వచ్చి నిలబడలేకేపోయింది.