Movies

అల్లరి ప్రేమికుడు సినిమాని మిస్ చేసుకున్న హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

జగపతి బాబు,రంభ,సౌందర్య నటించిన అల్లరిప్రేమికుడు మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కాంచన్ అనే మరో హీరోయిన్ కూడా చేసింది. ముగ్గురు హీరోయిన్స్ తో జగపతిబాబు రొమాన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమా ముందుగా కమల్ హాసన్ తో తీయడానికి రాఘవేంద్రరావు సిద్ధమయ్యారని చాలామందికి తెలీదు. అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు హిట్ కావడంతో అల్లరి ప్రేమికుడు మూవీకి శ్రీకారం చుట్టారు. మీనా దివ్యభారతిలను హీరోయిన్స్ గా సెలక్ట్ చేసారు.

షూటింగ్ స్టార్ట్ చేసే సమయానికి దివ్య భారతి మరణించడంతో సీన్ రివర్స్ అయింది. సౌందర్య , రంభ లను సెలెక్ట్ చేసారు. మూడో హీరోయిన్ కూడా కావాలని నిర్ణయించడంతో ముగ్గురి మధ్య హీరోగా జగపతి బాబు బెస్ట్ అని భావించి కమల్ ని తప్పించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."