బెంగుళూరు పద్మ కూతురు కూడా నటేనని తెలుసా ?
పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన బెంగుళూరు పద్మ ఒకప్పుడు వెండితెరపై సత్తా ఉన్న పాత్రలు చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్న బెంగుళూరు పద్మ ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అద్భుతంగా నటిస్తోంది. పలు సీరియల్స్ కి కమిట్ అయింది.
ప్రముఖ నటుడు అరుణ్ కుమార్ ని పెళ్ళిచేసుకుని ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుకి జన్మనిచ్చిన పద్మ మళ్ళీ సీరియల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో అల్లు రామలింగయ్య నటించిన ఆలుమగలు మూవీతో టాలీవుడ్ లో పద్మ ఎంట్రీ ఇచ్చి, మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టూవర్టుపురం దొంగలు మూవీతో సహా 150సినిమాల్లో పలు పాత్రల్లో మెప్పించింది.
ప్రేమ ఎంత మధురం సీరియల్ లో తన నటనతో అందర్నీ మెప్పిస్తోంది. అయితే పద్మ కూతురు గాయత్రీ కూడా నటే. ఈమె కూడా పలు సినిమాల్లో నటించింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హాపీ డేస్ మూవీస్ లో అప్పుగా గాయత్రీ నటించి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలో హారతి పాత్రలో గాయత్రీ మెప్పించింది. గాయత్రి పెళ్లి చేసుకొని సెటిల్ అయింది.